News January 30, 2025
విద్య భవిష్యత్తును నేర్పిస్తుంది:గద్వాల DSP

జోగులాంబ: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య అన్నారు. బుధవారం గట్టు మండల పరిధిలోని చాగదోనలో పాఠశాల సిబ్బంది ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు సూచనలిచ్చారు. విద్య భవిష్యత్తును నేర్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఇష్టంతో చదవాలని అన్నారు.
Similar News
News November 4, 2025
నిర్మల్: ‘పేదింటి బిడ్డను కాపాడండి.. ప్లీజ్..!’

నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన సంఘ దుర్గభవాని మెదడులో వాటర్ బెలూన్స్ వ్యాధితో బాధపడుతోంది. దుర్గ భవానికి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దుర్గ భవానిది నిరుపేద కుటుంబం కావడంతో ఆపన్న హస్తం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని వేడుకుంటున్నారు.
News November 4, 2025
వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.


