News March 18, 2024
కృష్ణా: BSP తొలి అభ్యర్థుల జాబితా విడుదల

బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
Similar News
News March 22, 2026
కృష్ణా: అపరాల రైతుల తిప్పలు.. పట్టాల కోసం పరుగులాట!

జిల్లాలో మారుతున్న వాతావరణం అపరాల సాగు రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాల ముప్పు నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్ పట్టాల కోసం పరుగులు తీస్తున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్‌లో పట్టాల కొరత ఏర్పడింది. చేసేది లేక అద్దె కేంద్రాల వద్ద లభించే చినిగిన, పాడైన పట్టాలనే తీసుకెళ్తున్నారు. తగినన్ని పట్టాలు అందుబాటులో లేక, ఉన్నవాటికి అద్దెలు పెరగడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
News March 22, 2026
నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
News March 22, 2026
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర రూ.390!

మచిలీపట్నం మాంసం మార్కెట్‌లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా ఉన్నప్పటికీ, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో చికెన్ స్కిన్‌లెస్ రూ. 390 పలుకుతోంది. మటన్ కిలో రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చేపల మార్కెట్‌లో బొచ్చె రూ. 200, సీలావతి రూ. 170కి విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


