News January 30, 2025

ఏలేరు కాల్వలో కొనసాగుతోన్న గాలింపు

image

అనకాపల్లి సమీపంలోని బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాల్వలోకి బొలెరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.  ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంత మంది ఉన్నారనే విషయాలపై అనకాపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వాహనంలో మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 29, 2025

కొత్తవలసలో 104 వాహనాలు తనిఖీ

image

సీతానగరం మండలం కొత్తవలసలో వైద్య సేవలు అందిస్తున్న 104 వాహనాన్ని బుధవారం జిల్లా మేనేజర్ S.కృష్ణ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రోగులతో మాట్లాడి సిబ్బంది పనితీరును, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందుల లభ్యత వాటి కాలపరిమితి, వాహన రికార్డులు, మందుల వాడకం రికార్డులను పరిశీలించారు. తుఫాన్ కారణంగా వాహనాలను సేఫ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని సిబ్బందికి సూచించారు.

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.

News October 29, 2025

కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

image

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.