News January 30, 2025
నేడు రంజీ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ రంజీ మ్యాచ్ ఆడనున్నారు. డిల్లీలో రైల్వేస్‌తో జరగబోయే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారు. కాగా కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్‌ను ‘Jio Cinema’ టెలికాస్ట్ చేయనుంది. కాగా కోహ్లీ ఓవరాల్‌గా 23 రంజీ మ్యాచులు ఆడి 1,547 పరుగులు చేశారు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి.
Similar News
News September 19, 2025
తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్‌ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్‌కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.
News September 19, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి <<17735732>>అంతర పంటలు<<>>గా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
News September 19, 2025
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.