News January 30, 2025
ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణకు అనుమతి

వివిధ స్థాయిల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను ఉచితంగా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించడానికి అనుమతించినట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖధికారి ప్రొ. రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. అవసరమైన సూచనలు జారీ చేశారన్నారు.
Similar News
News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
హోలీ పిడిగుద్దులాట.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

హోలీ సందర్భంగా శివంపేట మండలం <<15752874>>కొంతాన్‌పల్లి<<>>లో నిర్వహించిన పిడుగుద్దులాటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. హోలీని పురస్కరించుకొని ప్రతి ఏటా సంప్రదాయం ప్రకారం పిడితాడు లాగుతూ పిడుగుద్దులాటం ఇక్కడ ఆనవాయితీ. కాగా ఇందులో ఎస్సీ కలకంటి వర్గం పాల్గొంటామని చెప్పడంతో పతందార్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తూప్రాన్ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య కార్యక్రమం నిర్వహించారు.
News March 14, 2025
నీటి ఎద్దడిలో రైతులకు సూచనలు.. Way2news స్పెషల్

వేసవి సమీపిస్తున్న వేళ రైతులు పంటలకు తడులు వేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన నర్సాపూర్లో Way2newsతో మాట్లాడుతూ.. జిల్లాలో 2,58,487 ఎకరాలో వరి, 8321 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో రైతుల నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగుచేసుకోవాలని సూచించారు.