News March 18, 2024

ఆదోనిలో అంత‌ర్రాష్ట్ర సెప‌క్ త‌క్రా పోటీలు

image

రాయలసీమ వర్శిటీ, ఆదోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ త‌క్రా పోటీలు సోమ‌వారం ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో రెండో రోజు కొన‌సాగాయి. రెండో రోజు Apj Abdul Kalam యూనివర్సిటీపై MJPR బరేలి యూనివర్సిటీ, శ్రీ కుషల్ దాస్ యూనివర్సిటీపై అన్నా విశ్వవిద్యాలయం, మాధవ్ యూనివర్సిటీపై ఉస్మానియా యూనివర్సిటీ, గొందావాన్ యూనివర్సిటీపై రాయలసీమ యూనివర్సిటీ జట్లు విజయం సాధించాయి.

Similar News

News April 10, 2025

కర్నూలుతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హౌసింగ్, పిజిఆర్ఎస్, పీఆర్ వన్ యాప్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రీసర్వే, ఐవిఆర్ఎస్ వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు పరిశీలించి, అధికారులకు నిబంధనలు, ఆదేశాలు జారీ చేశారు.

News April 9, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

image

➤ ఓటర్ల సమస్య పరిష్కరిస్తాం: కలెక్టర్
➤ కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్
➤ మంత్రాలయం: రేషన్ షాపుల్లో రసీదులు తీసుకోవాలి
➤ జగన్‌‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి: సోమిశెట్టి
➤ఆదోనిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
➤మంత్రాలయంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం
➤ఆదోని: ‘అసాంఘిక కార్యకలాపాల నివారణ మా లక్ష్యం’
➤జిల్లా వ్యాప్తంగా వినతులు స్వీకరించిన టీడీపీ నాయకులు

News April 9, 2025

కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్

image

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

error: Content is protected !!