News January 30, 2025
రాష్ట్ర స్థాయిలో హనుమకొండ బిడ్డ సత్తా చాటాడు

ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో హనుమకొండ నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొప్పుల చరణ్ వరంగల్ జిల్లా తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఈ పోటీల్లో వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఇన్‌ఛార్జ్ కె.విద్యాకర్ అభినందించి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
Similar News
News February 27, 2026
NHM తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ మిషన్(NHM) తూర్పు గోదావరి జిల్లాలో 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(స్పీచ్&లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు, GNM అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in
News February 27, 2026
ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్’

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్ చాట్ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
లిక్కర్ కేసు.. తీర్పును సవాల్ చేయనున్న సీబీఐ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు సంస్థ తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే స్కామ్‌లో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు.


