News January 30, 2025

డీఎస్పీగా మరో భారత క్రికెటర్‌

image

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ శర్మ ఆమెను సత్కరించారు. కాగా డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో తెలిపారు.

Similar News

News February 20, 2025

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: ERC

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని విద్యుత్ నియంత్రణ మండలి(ERC) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 ఏడాదికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీల టారిఫ్‌లను విడుదల చేసిన ఆయన, ఏ విభాగంలోనూ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉండగా, ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

News February 20, 2025

‘లైలా’ డిజాస్టర్.. విశ్వక్‌సేన్ కీలక నిర్ణయం

image

‘లైలా’ సినిమా డిజాస్టర్‌ కావడంపై విశ్వక్ సేన్ ప్రకటన విడుదల చేశారు. ‘మీరు కోరుకున్న స్థాయికి నా సినిమాలు చేరుకోలేకపోయాయి. లైలాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను అంగీకరిస్తున్నా. మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నా ప్రతి సన్నివేశం మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తా’ అని విశ్వక్ పేర్కొన్నారు.

News February 20, 2025

టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్.. బంగ్లాకు వరం!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఘోరమైన ఫీల్డింగ్ చేస్తోంది. అక్షర్ బౌలింగ్‌లో రోహిత్ ఓ క్యాచ్, జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ స్టంపింగ్ మిస్, శ్రేయస్ అయ్యర్ రనౌట్ ఛాన్స్ మిస్, కుల్దీప్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఓ క్యాచ్ మిస్ చేశారు. దీంతో బంగ్లా బ్యాటర్లు బతికిపోయారు. టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా బంగ్లా 35/5 దశ నుంచి 120/5తో కోలుకుంది.

error: Content is protected !!