News January 30, 2025
KMR: పోక్సో కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో చట్టం కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమాన విధిస్తూ కామారెడ్డి జిల్లా అదనపు జడ్జి లాల్ సింగ్ బుధవారం తీర్పుచ్చినట్లు జిల్లా SP సింధు శర్మ తెలిపారు. వడ్లూరుకు చెందిన షేక్ కరీం 2020లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబీకులు దేవునిపల్లి PSలో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ జ్యోతి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు.
Similar News
News September 17, 2025
బాపట్లలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్

ఆరోగ్యకరమైన మహిళలు – బలమైన కుటుంబం లక్ష్యంతో చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం బాపట్లలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.
News September 17, 2025
రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.
News September 17, 2025
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: GWL కలెక్టర్

జోగులాంబ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. ఈ నెలలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.