News January 30, 2025

నాగోబా ప్రజాదర్బార్‌కు 83 ఏళ్ల చరిత్ర

image

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.

Similar News

News January 6, 2026

హిల్ట్ పాలసీ లీక్ కేసులో నలుగురు అధికారులు!

image

TG: హిల్ట్ పాలసీ సమాచారాన్ని ఇటీవల BRSకు లీక్ చేసిన వ్యవహారంలో ఇద్దరు IASలతో సహా నలుగురు అధికారుల పాత్ర ఉందని విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు CMOకు నివేదిక అందించగా, ఇందులో తన పాత్ర లేదని CMకు ఓ IAS వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC)కి చెందిన ఇద్దరు అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా, ఓ IASను బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

News January 6, 2026

జగిత్యాల: ఘనంగా మేడారం జాతర.. సీఎంను ఆహ్వానించిన మంత్రులు

image

ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. సోమవారం అసెంబ్లీలో మేడారం పూజారులతో కలిసి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై మంత్రులు ఈ సందర్భంగా సీఎంతో చర్చించారు.

News January 6, 2026

SC ఉత్తర్వులపై విపక్షాల ప్రశ్నలు

image

ఢిల్లీ అల్లర్ల కేసు(2020)లో సామాజిక కార్యకర్తలు ఉమర్, షర్జీల్‌లకు SC బెయిల్ నిరాకరించడాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. మహిళలపై అత్యాచారం చేసిన కేసు(2017)లో గుర్మీత్ సింగ్‌కు 15వ సారి పెరోల్‌పై కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశాయి. విచారణ లేకుండా 5 ఏళ్లు నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని MA బేబీ(CPM) వ్యాఖ్యానించారు. బెయిల్ నిరాకరణ ద్వంద్వ నీతిని బహిర్గత పరుస్తోందని D.రాజా(CPI) అన్నారు.