News January 30, 2025
నాగోబా ప్రజాదర్బార్‌కు 83 ఏళ్ల చరిత్ర

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.
Similar News
News November 4, 2025
లాజిస్టిక్ కారిడార్‌తో అభివృద్ధి: చంద్రబాబు

APలో అంతర్గత జల రవాణాకు పుష్కలంగా అవకాశాలున్నాయని CM చంద్రబాబు పేర్కొన్నారు. లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్ కారిడార్‌తో APని అభివృద్ధి చేసే ప్రణాళికలు రచిస్తున్నట్లు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జల రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్‌లోని అరుప్ సంస్థను CM కోరారు.
News November 4, 2025
చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్‌పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
News November 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 04, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


