News January 30, 2025

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

image

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.

Similar News

News September 17, 2025

సంచలన తీర్పులకు కేరాఫ్.. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

image

నల్గొండ పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి N.రోజారమణి తన తీర్పులతో తప్పు చేయాలనుకునే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జులై 4 నుంచి ఈ నెల 16 వరకు పది పోక్సో కేసుల్లో తీర్పులిచ్చారు. వీటిలో ఒక కేసులో దోషికి ఉరి శిక్ష, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు.

News September 17, 2025

HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

image

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

News September 17, 2025

పాలమూరు నిరుద్యోగులకు జాబ్ మేళా

image

మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగుల కోసం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పాసైన 18 నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళా వివరాల కోసం 93981 72724, 63648 67804, 63648 63213 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
SHARE IT