News March 18, 2024
ఆ పార్టీకి రూ.5 కోట్ల విరాళాలు ఇచ్చిన సీఎస్కే యాజమాన్యం
ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు వచ్చిన విరాళాల జాబితాను ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK యాజమాన్యం మెజారిటీ విరాళాలను అందజేసింది. ఆ పార్టీకి రూ.6.05 కోట్లు విరాళాలు రాగా, వాటిలో సీఎస్కే యాజమాన్యమే రూ.5 కోట్లు ఇచ్చినట్లు ఈసీ గణాంకాలు పేర్కొన్నాయి. 2019 ఏప్రిల్‌లో ఈ విరాళాలు ఇవ్వడం గమనార్హం.
Similar News
News January 9, 2025
తిరుపతి బాధితులను పరామర్శించనున్న జగన్
AP: తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఇవాళ సాయంత్రం స్విమ్స్ ఆస్పత్రిలో ఆయన బాధితులతో సమావేశమవుతారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది.
News January 9, 2025
వెంటిలేటర్‌పై ఎవరూ లేరు: సత్యకుమార్
AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్‌పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇంకా 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
News January 9, 2025
మావోయిస్టులపై మరోసారి పోలీస్ పంజా
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.