News January 30, 2025
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: ASF కలెక్టర్

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
వీడీవీకే స్టాల్స్ పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా వన్ ధన్ వికాస కేంద్రాల స్టాల్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. శనివారం ట్రైఫెడ్ ఆధ్వర్యంలో రుషికొండ వద్ద జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడ పార్వతీపురానికి చెందిన జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను, పాచిపెంట వీడీవీకే ద్వారా ఏర్పాటు చేసిన మిల్లెట్స్ స్టాల్‌ను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీపీఎం శ్రీరాములు తెలిపారు.
News November 15, 2025
రెబ్బెన: యాక్సిడెంట్.. కానిస్టేబుల్ మృతి

రెబ్బెన మండలం కైరిగాం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిర్యానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ రాము శనివారం ఉదయం మృతి చెందినట్లు రెబ్బెన SI వెంకటకృష్ణ తెలిపారు. ఈ నెల 13న కైరిగాం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాము తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు SI వెల్లడించారు.
News November 15, 2025
యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


