News January 30, 2025
బెజ్జూర్: హాస్టల్‌లో మృతిచెందిన విద్యార్థి కుటుంబీకులకు ఉద్యోగం

ఇటీవల ఆసిఫాబాద్ బీసీ హాస్టల్‌లో అనారోగ్యంతో మండలంలోని అందుగులగూడకు చెందిన వెంకటలక్ష్మి అనే విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై బీఆర్ఎస్ నాయకులు RS ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటంతో కుంటలమానేపల్లి ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ఆమె సోదరుడు ధర్మయ్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినట్లు నియోజకవర్గ కన్వీనర్ రాంప్రసాద్ తెలిపారు. కుటుంబానికి ఉద్యోగం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News November 4, 2025
మీర్జాగూడ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణం: DGP

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని DGP శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ‘ఇక్కడ రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయి. టిప్పర్ కండిషన్‌ను పరిశీలిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదు. అందరి బాధ్యతగా చూడాలి. డ్రైవర్లు డిఫెన్స్ కండిషన్‌ను అంచనా వేసుకోవాలి’ అని సూచించారు.
News November 4, 2025
తిరుపతి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భారీ భద్రత

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఆలయాల్లో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ నిర్వాహణ, వచ్చి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శనం తదితర అంశాలపై ఆయా ఆలయాల కమిటీలతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
News November 4, 2025
జూరాలకు 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 28 వేల క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 30,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాలువలకు, భీమా లిఫ్ట్‌కు కలిపి 2,018 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 33,102 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు.


