News January 30, 2025
నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

AP: మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్‌తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News January 11, 2026
MLAపై మూడో రేప్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

కేరళ MLA రాహుల్ మాంకూటతిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్‌లోని ఒక హోటల్లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించింది.
News January 11, 2026
టెన్త్ అర్హతతో YSR కడప జిల్లాలో ఉద్యోగాలు

AP: <
News January 11, 2026
ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్లో నిరసనలు తీవ్రమవుతున్న వేళ ఆ దేశంలో సైనిక చర్య చేపట్టే అవకాశాలపై ట్రంప్‌కు అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారని NYT పేర్కొంది. టెహ్రాన్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, కీలక నేతల సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ దాడులు చేసే ఆప్షన్స్‌ను పరిశీలించారని తెలిపింది. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని, US వారికి సాయం చేయడానికి రెడీగా ఉందని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


