News January 30, 2025
వేసవిలో త్రాగునీటి ఎద్దడి ఉండొద్దు: భద్రాద్రి కలెక్టర్

వేసవిలో నీటి కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి లభ్యత, నీటి సరఫరాలో సమస్యలను గుర్తించి పది రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని సూచించారు.
Similar News
News November 17, 2025
గిగ్ వర్కర్ల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

TG: గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత వర్కర్లకు సామాజిక భద్రత, భరోసా కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజీ డెలివరీల్లో పనిచేస్తున్న 4 లక్షల మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గిగ్ వర్కర్లు వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి వివేక్ సూచించారు. త్వరలో అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.

ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.