News January 30, 2025
కుక్కునూరు: జామాయిల్ తోటలో అస్థిపంజరం లభ్యం

కుక్కునూరు గ్రామ శివారులోని రైస్ మిల్ వెనక జామాయిల్ తోటలో అస్థిపంజరం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా మృతుడు తెలంగాణలోని చర్ల ప్రాంతానికి చెందిన ఐత రమేశ్ (42)గా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా.. చికిత్స చేయించుకున్నా వ్యాధి తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Similar News
News February 27, 2026
విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.
News February 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 27, 2026
రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.


