News January 30, 2025

కామారెడ్డి: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

image

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం PSలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలిక(17)కు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పోక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News September 19, 2025

వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

image

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News September 19, 2025

NMMS స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు: డీఈవో

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.