News January 30, 2025
పెద్దాపురం: బాలికతో వ్యభిచారం.. వెలుగులోకి కీలక విషయాలు

పెద్దాపురానికి చెందిన యువకుడు బాలికను పెళ్లి చేసుకుని వ్యభిచారంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు
ఇన్ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటికే బాలిక కదల్లేని స్థితికి చేరుకుంది’ అని తెలిపారు.
Similar News
News February 21, 2025
RJY: పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర

గుంటూరు మిర్చి యార్డులో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కూటమి నేతలతో గురువారం జరిగిన సమావేశానికి ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పరదాల చాటున దాక్కొన్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
News February 20, 2025
రాజమండ్రి: క్యూ ఆర్ కోడ్‌తో మెరుగైన పౌర సేవలు

ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవల విషయంలో క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్ పరీక్షలు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలు కోసం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News February 20, 2025
తూ.గో: కోడిపందేలపై పోలీసుల దాడులు

నల్లజర్ల మండలం ముసళ్లకుంట గ్రామంలో కోడిపందేల స్థావరంపై నల్లజర్ల పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లు, 7 కార్లు, ఒక మోటార్ సైకిల్ , 2 కోడి పుంజులు , రూ.6.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.