News January 30, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 27, 2026
కర్నూలు: ముగ్గురిపై జిల్లా బహిష్కరణ

జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు(M) పి.రుద్రవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పుండుకుర మధు, మధుసూదన్ తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా బహిష్కరణకు గురైన వారి సంఖ్య 8కి చేరింది.
News March 27, 2026
ఈ టైమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తే గుండె సేఫ్!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేసే టైమింగ్ ముఖ్యమని తాజా స్టడీలో తేలింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వర్కౌట్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. దీనివల్ల ఒబెసిటీ 35%, గుండె జబ్బులు 31%, షుగర్ రిస్క్ 30% తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఉదయం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, కొవ్వు త్వరగా కరగడం దీనికి కారణాలు.
News March 27, 2026
మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.


