News January 30, 2025
భువనగిరి: వాగులో జారిపడి దంపతులకు గాయాలు

వాగు దాటుతుండగా జారి పడిపోవడంతో దంపతులకు గాయాలైన ఘటన ఆలేరులో జరిగింది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సందెన రామనర్సయ్య, అతడి భార్య లక్ష్మి బైక్‌పై పోచన్న పేటలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో కొలనుపాక వాగు దాటుతుండగా జారి వాగులో పడిపోయారు. తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 10, 2025
మరిపెడ: తండా నుంచి హైకోర్టు న్యాయవాదిగా..

మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ నాయక్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మారుమూల తండా నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి న్యాయశాఖలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. లా విద్యను సంగారెడ్డిలోని టిటిడబ్ల్యూఆర్ కళాశాల నుంచి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.
News November 10, 2025
రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం

ఇవాళ ఉదయం రాయచోటి కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు జిల్లా కలెక్టరేట్‌కు రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చనన్నారు. అర్జీ స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు. అర్జీలు స్థానికంగా పరిష్కారం కాని ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిందిగా తెలిపారు.
News November 10, 2025
పుష్పగిరి ఆలయంలో ఒకే పలకపై శివపార్వతి కుటుంబ విహార శిల్పం

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై ఉన్న అద్భుత కుడ్య శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేశ్ వివరించారు. ఈ శిల్పంలో శివపార్వతులు నందిపై, వారి కుమారులు వినాయకుడు (మూషికంపై), సుబ్రహ్మణ్య స్వామి (నెమలిపై) కుటుంబ సమేతంగా విహరిస్తున్నట్టు చిత్రీకరించారు. మకర తోరణం, అష్టదిక్పాలకులు కూడా ఈ శిల్పంలో చెక్కబడ్డాయి. ఇది ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక అని తెలిపారు.


