News January 30, 2025

బస్సు నుంచి జారిపడి విద్యార్థి మృతి

image

విడపనకల్ మండలం డొనేకల్లులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి హేమంత్(15) బుధవారం ప్రమాదవశాత్తు బస్సు నుంచి జారీ పడి మృతి చెందాడు. హేమంత్ గడేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ డొనేకల్లు నుంచి గడేకల్లులోని పాఠశాలకు వచ్చేవాడు. బుధవారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఆర్టీసీ బస్సులో గ్రామానికి వెళ్తుండగా బస్సు దిగే క్రమంలో జారీ కింద పడి మృతి చెందాడు.

Similar News

News October 30, 2025

500 గిగావాట్ల విద్యుదుత్పత్తి.. భారత్ రికార్డ్

image

దేశంలోని అన్ని వనరుల నుంచి కలిపి విద్యుదుత్పత్తి తొలిసారి 500 గిగావాట్లను దాటింది. ఇది సరికొత్త రికార్డని కేంద్రం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్ల ఉత్పత్తి ఉండగా ఈ ఏడాది SEP 30 నాటికి రెట్టింపు ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. ఇందులో జల, అణు, సౌర, పవన విద్యుత్ వాటా 256 గిగావాట్లు, శిలాజ వనరుల వాటా 244.80 గిగావాట్లుగా ఉందని వెల్లడించింది.

News October 30, 2025

మళ్లీ భీకర దాడులు.. గాజాలో 104 మంది మృతి

image

ఇజ్రాయెల్-గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి బ్రేకయ్యింది. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 104 మంది పౌరులు మరణించగా, 250 మందికి గాయాలయ్యాయి. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. స్కూళ్లు, నివాసాలపై IDF బాంబులు వేసినట్లు ఆరోపించింది.

News October 30, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మంత్రాలతో పాప పరిహారం కాదు. కర్మలచేతనే కొంత వరకైనా పాప పరిహారం గావించుకోవచ్చు
★ మానవ జీవితం అపూర్వమైన వరం. ఆనందవ్యాప్తికి దానిని వినియోగించండి
★ నోటితో ధర్మం అని ఉచ్చరిస్తూ ఆచరణతో దాన్ని ఖండించకు
★ ప్రేమే దైవం. దైవమే ప్రేమ. ప్రేమ ఎక్కడుంటే అక్కడ తప్పక దైవం ఉంటాడు.
#సత్యసాయి శత జయంతి
24 Days Go