News January 30, 2025

KTDM: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొదలైన కోలాహలం

image

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో కోలాహలం మొదలైంది. కాగా ఇటీవలే ఈ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల పరిధిలో 23 పోలింగ్ బూత్‌ల పరిధిలో 1,949 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 1,038 మహిళలు 941 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News July 4, 2025

ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

image

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.

News July 4, 2025

సిరిసిల్ల రచయితకు దక్కిన అరుదైన గౌరవం

image

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత డా.పెద్దింటి అశోక్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘లాంగ్ మార్చ్’ నవలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో MA తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్‌లోకి చేర్చారు. ఆయన రచించిన మరో ప్రఖ్యాత నవల ‘జిగిరి’ను నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ అకాడమిక్ సిలబస్‌గా బోధించనున్నారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె పాఠశాలలో పనిచేస్తున్నారు

News July 4, 2025

గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

image

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.