News January 30, 2025
తిరుమలలో ఫిబ్రవరిలో ప్రత్యేక కార్యక్రమాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. ఫిబ్రవరి 02న వసంత పంచమి, ఫిబ్రవరి 04న రథసప్తమి, ఫిబ్రవరి 05న భీష్మాష్టమి, ఫిబ్రవరి 06న మాధ్వ నవమి, ఫిబ్రవరి 08న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ జరగనుంది. ఫిబ్రవరి 24న సర్వ ఏకాదశి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు.
Similar News
News September 18, 2025
అఫ్జల్‌సాగర్‌లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్‌సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.
News September 18, 2025
HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.