News January 30, 2025

FLASH: రాచమల్లు తల్లి మృతి

image

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రాచమల్లు ముని రత్నమ్మ(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లో పెద్ద కుమారుడు కిరణ్ రెడ్డి ఇంట్లో ఉండగా గురువారం ఉదయం ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు ఆమె భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. 

Similar News

News March 7, 2026

కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

image

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరిగాయి. నేడు జరిగిన కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షలు 3,764 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 3,383 మంది రాశారు. 381 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎకనామిక్స్ పరీక్షలు 2,257 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 2,028 మంది హాజరయ్యారు. అయితే 229 మంది గైర్హాజరయ్యారు.

News March 7, 2026

కడప: పరీక్షకు 90% విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలోని 62 కేంద్రాల్లో శనివారం ఇంటర్ పస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించారు. 90% విద్యార్థులు హాజరయ్యారు. 5,130 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,600 మంది రాశారు. 530 మంది అబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 4,013 మందికి 3,658 మంది పరీక్షలు రాశారు. 355 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,117 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 942 మంది రాశారు.