News January 30, 2025
Stock Markets: మెటల్, ఫార్మా షేర్లకు డిమాండ్

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,200 (+37), సెన్సెక్స్ 76,553 (+18) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తగ్గాయి. మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. బజాజ్ ట్విన్స్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ టాప్ లూజర్స్. నిఫ్టీ ADV/DEC 39:12గా ఉంది.
Similar News
News January 26, 2026
వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News January 26, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 26, 2026
టీ20 వరల్డ్‌కప్ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


