News January 30, 2025
వనపర్తి: భారీ కొండచిలువ పట్టివేత

వనపర్తి మండలం కాశీంనగర్ సమీపంలో ఎర్రగట్టు తండాకు కూతవేటు దూరంలోని వ్యవసాయ పొలంలో సుమారు 11 ఫీట్ల కొండచిలువ బుధవారం రైతుల కంటపడింది. భయపడిన రైతులు, కూలీలు గట్టిగా కేకలు పెట్టారు. వెంటనే స్నేక్స్ సొసైటీ టీంకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పంటలకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసిన వలకు చిక్కిన సుమారు 18కిలోల కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అడవిలో వదిలేశారు.
Similar News
News March 14, 2025
అంతరాలను అధిగమించే పండగ హోలీ !

అంతరాలను అధిగమించే పండగ హోలీ పండుగ అని ప్రముఖ చిత్రాకారులు రుస్తుం అన్నారు. హోలీ పండుగ పురస్కరించుకుని గురువారం సిద్దిపేట రుస్తుం ఆర్ట్స్ గ్యాలరీలో అంతరంగుల ఆనంద హోలీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఆవిష్కరించారు. హోలీ జన చైతన్యాన్ని తెస్తుందన్నారు. ప్రపంచ నలుమూలలా ఈపండగ ఐక్యత చాటుతుందన్నారు.బేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News March 14, 2025
బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
News March 14, 2025
NRPT: ‘పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 19లోపు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ జాబితాలో సవరణలు చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు.