News January 30, 2025
MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.
Similar News
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 17, 2025
సీసీఐ నిబంధనలపై నిరసన.. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

ఖమ్మం: సీసీఐ విధించిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాటన్ ట్రేడర్స్, మిల్లర్స్ అసోసియేషన్ నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొనుగోళ్లు ఆగిపోతే రైతులకు మద్దతు ధర దక్కదని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 17, 2025
iBOMMAకు ఎందుకంత క్రేజ్?

ఇతర పైరసీ వెబ్సైట్లలో యాడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీక్షకులు డిస్టర్బ్ అవుతారు. కానీ ఐబొమ్మలో సినిమా చూసేందుకు క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాడ్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి మరోసారి ఓపెన్ చేస్తే ఇక యాడ్స్ కనిపించవు. అలాగే HD ప్రింట్ వస్తుంది కాబట్టి లక్షల మంది ఆ సైట్లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను ప్రతి నెలా 30 లక్షల మంది చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


