News January 30, 2025
రాయచోటి: మృతుడి పిల్లలకు రూ.లక్ష చెక్కు అందజేత

అధ్యాపకుడి పిల్లలకు రూ.లక్ష సాయాన్ని DRO మదన్ మోహనరావు బుధవారం రాయచోటిలో అందజేశారు. తంబళ్లపల్లె ఎకనామిక్స్ లెక్చరర్ వెంకటరమణ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. కలెక్టరేట్లో DIEO కృష్ణయ్య, ప్రిన్సిపాల్ అమరేంద్ర తదితరులు లెక్చరర్ చనిపోయి పిల్లలు అనాధలైన విషయాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి విన్నవించారు. కలెక్టర్ రూ.లక్ష చెక్కు, మరో రూ.72వేలు అకౌంట్లో వేశారు.
Similar News
News November 10, 2025
ఏటూరునాగారంలో 80 రకాల సీతాకోక చిలుకలు

తెలంగాణలో 140 రకాల సీతాకోక చిలుకలు ఉంటే ఒక్క ఏటూరునాగారం అభయారణ్యంలోనే 80 రకాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. వీటిలో స్పార్టెడ్ యాంగిల్, స్మాల్ ప్లాట్, రెడ్ఐ, గ్రిజ్ల్ స్కిప్పర్, బ్లాక్ రాజా, టాని రాజా, ఓక్ బ్లూ, నవాబ్ వంటి అరుదైన రకాలు ఉన్నట్లు గుర్తించారు. పర్యావరణ సమతుల్యతలో సీతాకోక చిలుకలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటి మానుగడ నిర్ధారించడానికి మరిన్ని సర్వేలు జరగాల్సి ఉందని డీఎఫ్ఓ జాదవ్ అన్నారు.
News November 10, 2025
అయిజ: పత్తి రైతులకు స్లాట్ బుకింగ్ అవకాశం

గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో నవంబర్ 17న పత్తి విక్రయించేందుకు రైతులు సోమవారం ఉదయం 8:30 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని అయిజ ఏఓ జనార్ధన్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు 17న గద్వాల బాలాజీ కాటన్ మిల్ లేదా అలంపూర్ వరసిద్ధి వినాయక కాటన్ మిల్స్‌లో పత్తి విక్రయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 10, 2025
కలలో శివయ్య కనిపిస్తే..?

‘కలలో శివుడిని/శివ లింగాన్ని చూడటం పవిత్రమైన సంకేతం. కలలో శివలింగం కనిపిస్తే దీర్ఘకాల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. పరమేశ్వరుని దర్శనం లభిస్తే, మీ ఆదాయం పెరిగి, అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివుని మెడలో పాము కనిపిస్తే ఆర్థిక లాభాలుంటాయి. త్రిశూలం కనిపిస్తే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది’ అని స్వప్న శాస్త్రం చెబుతోంది.


