News January 30, 2025
బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే.!

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే <<15306092>>బాపట్ల జిల్లాలోని<<>> వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా గ్రాడ్యుయేట్ MLCగా ఉన్న KS లక్ష్మణరావు మరోసారి పోటీ చేయనుండగా.. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు.
Similar News
News November 4, 2025
మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

జీఎస్ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 4, 2025
ధాన్యం తరలింపుపై కలెక్టర్ సమీక్ష

వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


