News March 18, 2024
బ్యాటర్‌గా బరిలోకి దిగనున్న రాహుల్!

క్రికెటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో బెంగళూరులోని NCAలో చేరారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో ఈ ఐపీఎల్ ఆడేందుకు అతడికి ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రారంభంలోని కొన్ని మ్యాచ్‌లకు కీపింగ్ చేయొద్దని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. రాహుల్ LSGకి కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News September 9, 2025
4 దశల్లో స్థానిక ఎన్నికలు: SEC

APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
News September 9, 2025
నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాను ఇచ్చింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని CM కోరారు.