News January 30, 2025

WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.

Similar News

News January 16, 2026

రేపు మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

image

పాలమూరు జిల్లాకు రేపు సీఎం ఏ.రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని జిల్లా పోలీసులు తెలిపారు. పిస్తా హౌస్ బైపాస్ నుంచి రాయచూర్ రోడ్డు, భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్, పీయూ కాలేజ్ కొత్త బైపాస్ నుంచి పిస్తా హౌస్ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.

News January 16, 2026

110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పుదుచ్చేరిలోని <>JIPMER<<>> 110 Sr. రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/జనరల్ మెడిసిన్/DM/MCh/MDS అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.1,30,000 చెల్లిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jipmer.edu.in

News January 16, 2026

HYDలో డ్రోన్ల జాతర.. నేడు హై-వోల్టేజ్ స్కై షో!

image

గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఎక్స్‌పో 2026 నేడు ప్రారంభం కానుంది. వెయ్యి డ్రోన్లతో ఆకాశంలో ప్రదర్శించే అద్భుత ఆకృతులు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ షోకు ఫ్రీ ఎంట్రీ. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, రేసింగ్‌ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ దృష్ట్యా సందర్శకులు ముందుగానే రావాలని నిర్వాహకులు సూచించారు. సంక్రాంతి సందడిని టెక్నాలజీతో జరుపుకోండి.