News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News November 7, 2025
నవీన్ యాదవ్‌పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
News November 7, 2025
ఆత్మకూరు: గుర్తు తెలియని శవం లభ్యం

తిప్పడం పల్లి సమీపంలో ఊక చెట్టు వాగు ఒడ్డున గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఆత్మకూరు ఎస్సై జయన్న తెలిపారు. ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పరుశరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండొచ్చన్నారు. ఆకుపచ్చ టీ షర్ట్ ధరించి ఉన్నాడని, శవాన్ని గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు.