News January 30, 2025

WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.

Similar News

News November 13, 2025

జనగామ: దందా ఎంపీవోలు.. భగ్గుమంటున్న కార్యదర్శులు..!

image

జనగామ జిల్లాలోని పలువురు మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో) దందాలకు పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రోహిబిషన్ ఫైల్స్, చేసిన పనులకు చెక్కులు జారీ చేసేందుకు చేతులు చాస్తున్నారు. గ్రామాల సందర్శనకు వచ్చినందుకు సైతం వారి వ్యక్తిగత కార్లలో పెట్రోల్‌కు సైతం పైసలు వసూల్ చేస్తున్న ఎంపీవోలపై కార్యదర్శులు భగ్గుమంటున్నారు.

News November 13, 2025

రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

image

గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ల సలహాతో అథ్లెట్లు, బాడీబిల్డర్లు 3-4 గుడ్లు తినొచ్చు. గుండె జబ్బులు, అధిక ఎల్‌డీఎల్, డయాబెటీస్ ఉన్నవాళ్లు, ఆహారంలో సంతృప్త కొవ్వులు తీసుకునేవారు గుడ్లు అధికంగా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.

News November 13, 2025

కల్వకుర్తి: చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలి- DEO

image

విద్యార్థులు ప్రాథమిక స్థాయినుండే చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి క్రీడలలో గెలుపొందిన విజేతలకు గురువారం సాయంత్రం బహుమతులను ప్రదానం చేశారు. కల్వకుర్తి ఎంజేపీ పాఠశాల విద్యార్థులకు ఛాంపియన్షిప్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి తదితరులున్నారు.