News January 30, 2025

MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

image

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News January 13, 2026

HYD: మట్టిలో పుట్టిన మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి

image

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ ద్రష్ట మర్రి చెన్నారెడ్డి 1919 JAN 13న వికారాబాద్ (D) మార్పల్లి (M) సిరిపురంలో జన్మించారు. MBBS పూర్తి చేసి వైద్యవృత్తిని ప్రజాసేవగా మలిచారు. 1969 TG ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ తెలంగాణ ప్రజా సమితికి నాయకత్వం వహించారు. ఉద్యమ ఉత్థాన, పతనాల మధ్య పార్టీని రాజకీయ శక్తిగా నిలిపారు. 1978లో మేడ్చల్ నుంచి MLAగా గెలిచి ఉమ్మడి AP CMగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.

News January 13, 2026

క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

image

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.

News January 13, 2026

NZB: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగంగారం తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు 5 నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.