News January 30, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాల్‌ ఫేక్‌ అని పోలీసులు తేల్చారు. కామారెడ్డికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.

Similar News

News January 12, 2026

ఆదాయం రూ.18వేల కోట్లు, అప్పులకు రూ.22వేల కోట్లు: CM

image

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపి వెళ్లిందని <<18837053>>CM<<>> రేవంత్ విమర్శించారు. ‘ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లు. కానీ ప్రతి నెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నాం. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. 10.50 లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములే. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ప్రస్తుతం ఎప్పుడు వస్తున్నాయో ఆలోచించండి’ అని అన్నారు.

News January 12, 2026

సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్.. కారణమిదే!

image

స్టాక్ మార్కెట్ సూచీల్లో ఈరోజు భారీ బౌన్స్ బ్యాక్ కనిపించింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 1000 పాయింట్లు పుంజుకోవడం విశేషం. చివరకు ఈ సూచీ 301 పాయింట్లు లాభపడి 83,878 వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,790 దగ్గర స్థిరపడింది. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై అమెరికా నియమిత రాయబారి సెర్గియో గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలు సూచీలను పైకి లేపాయి. దీంతో 5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది.

News January 12, 2026

PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి: CBN

image

AP: నిధులు లేవని పనులు ఆపొద్దని, క్రియేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్లాలని CBN సూచించారు. PPP పద్ధతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆదేశించారు. ‘కేంద్ర నిధులను కొన్ని శాఖలు ఖర్చు చేయడం లేదు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చే అవకాశమున్నా ఖర్చు చేయలేదు. నెలాఖరులోగా పూర్తి చేసి అదనపు నిధులు కోరాలి. కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు’ అని CM పేర్కొన్నారు.