News March 18, 2024
ఫోన్లోనే ఓటర్ IDలో పేరు మార్చుకోవచ్చు
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఫాం-8 నింపి ఓటరు కార్డులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అందులో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, పుట్టిన తేదీ, తండ్రి/భర్త పేరు, లింగం వంటివి ఉంటాయి. వాటిని మార్చుకొనేందుకు సంబంధిత కొన్ని ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
> https://voterportal.eci.gov.in
Similar News
News October 31, 2024
రూ.21కోట్లకు పూరన్ రిటెన్షన్!
నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్‌కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
News October 31, 2024
‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.
News October 31, 2024
థియేటర్లో సినిమా చూసిన ముఖ్యమంత్రి
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ థియేటర్లో సినిమా చూశారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీని ఆయన ఇవాళ వీక్షించారు. ‘మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని చిత్రంలో బాగా చూపించారు. ఇందులో కార్తికేయన్, సాయిపల్లవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌కు నా హ్యాట్సాఫ్’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూశారు.