News January 30, 2025
BREAKING: ‘వాట్సాప్ గవర్నెన్స్’ ప్రారంభం

AP: దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేవదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, CMRF, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్‌లో ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది.
Similar News
News March 14, 2025
సీఎం ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు: మంత్రి పొన్నం

TG: తమ ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా CM ఒక్కరే తీసుకోరని, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై BRS నిరసనకు దిగడం సిగ్గుచేటని అన్నారు. ‘తాము అనుకున్నట్లుగా సభ నడవాలనేది BRS నేతల ఉద్దేశం. అందుకే దుష్ప్రచారాలు చేస్తున్నారు. స్పీకర్‌గా దళితుడు ఉన్నారనే అవమానించారు. పొరపాటు అయ్యిందని చెబితే వివాదం ముగిసేది’ అని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.
News March 14, 2025
ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.