News January 30, 2025

హుస్నాబాద్: ఉపాధిహామీ కూలీల మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

image

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఉపాధి హామీలో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

Similar News

News July 5, 2025

కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.

News July 5, 2025

సుల్తానాబాద్: కేజ్ వీల్స్‌తో రోడెక్కిన ట్రాక్టర్‌కు జరిమానా

image

సుల్తానాబాద్ పట్టణం రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు తిరిగితే జరిమానాతోపాటు కేసులు నమోదు చేస్తామని సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన భూత గడ్డ చంద్రయ్య తన కేజ్ వీల్స్ ట్రాక్టర్‌తో రోడ్డుపై వెళుతుండగా అదుపులోకి తీసుకుని కేజ్ వీల్ ట్రాక్టర్‌ను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మొదటిసారి తప్పుగా భావించి MRO రూ.5వేల జరిమానా విధించారు.

News July 5, 2025

IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

image

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.