News March 18, 2024
OTTలో రికార్డు సృష్టించిన ‘హనుమాన్’
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు జీ5 వెల్లడించింది. ఈ ఏడాది ఇదే రికార్డని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నంబర్-1 స్థానంలో ట్రెండింగ్ అవుతోందని పేర్కొంది. కాగా థియేటర్లలో ఈ మూవీ దాదాపు రూ.350 కోట్లను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2025
వైకుంఠ ద్వార దర్శనం 10రోజులెందుకు?: సీఎం చంద్రబాబు
AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ‘వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని పది రోజులెందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారు ఇక్కడ వెలువడినప్పటి నుంచీ పాటించే సంప్రదాయాల్ని మార్చకుండా అనుసరించాలనేది నా అభిప్రాయం. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 9, 2025
చాలా బాధపడుతున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తన మనసు పూర్తిగా కలచివేసిందని CM చంద్రబాబు అన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలూ జరగకూడదని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దీన్ని ఎప్పుడూ కాపాడాలని ఒక భక్తుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడూ తీసుకుంటానన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని TTD అధికారులతో భేటీ అనంతరం స్పష్టం చేశారు.
News January 9, 2025
డ్రెస్సులపై కామెంట్స్.. హీరోయిన్ ఘాటు రిప్లై
హీరోయిన్ హనీరోజ్‌ను వేధించిన బాబీని పోలీసులు <<15102782>>అరెస్టు చేయగా<<>>, మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ అతనికి మద్దతుగా నిలిచారు. ఆమె ధరించే డ్రెస్సులపై విమర్శిస్తూ ఇలాంటి కామెంట్స్ సమాజంలో సహజమేనన్నారు. దీనిపై హీరోయిన్ ఫైరయ్యారు. ‘మీకు భాషపై పట్టుంది. కానీ మహిళల దుస్తుల విషయంలో మాత్రం కంట్రోల్ తప్పుతున్నారు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయనియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?’ అని ప్రశ్నించారు.