News January 30, 2025

HYD: బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

image

GHMC బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. GHMC బడ్జెట్ నగరాభివృద్ధికి సంబంధించిన అంశమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తోందన్నారు. అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.

Similar News

News October 16, 2025

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

News October 16, 2025

MBNR: పీయూలో ఘనంగా స్నాతకోత్సవం!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ఆడిటోరియంలో 4వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గురువారం మొత్తం 83 బంగారు పతకాలను పీయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీయూ ఉపకులపతి(VC) ఆచార్య డాక్టర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.

News October 16, 2025

వనపర్తి: ‘భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి’

image

మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరు వెంకట్ రాములు డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి, RRR రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.