News March 18, 2024
NZB: చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం

నిజామాబాద్‌లోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువులో సోమవారం రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపూర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య, పోశమ్మగా గుర్తించారు. వారు స్థానిక దర్గా వద్ద ఉంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 17, 2025
NZB: రెండు రోజులు జాగ్రత్త..!

గత వారం పదిరోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనాలు సతమతమవుతున్నారు. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ మేరకు రేపు ఎల్లుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 17, 2025
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: MLC కవిత

భీంగల్‌లో BRS పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీని డిమాండ్ చేశారు. అలాగే BRS కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ఆమె X లో డిమాండ్ చేశారు. లాఠీచార్జీలకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదే లేదన్నారు.
News April 17, 2025
ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.