News January 30, 2025
కామారెడ్డిలో మహిళ మృతదేహం కలకలం

కామారెడ్డిలో రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఇందిరా చౌక్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ పట్టణంలో భిక్షాటన చేసుకొని బతికేది. కాగా నిన్న సాయంత్రం ఇందిరా చౌక్ పై పడుకున్న ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News November 5, 2025
NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.
News November 5, 2025
వరంగల్: 95 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 95 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 53, సెంట్రల్ జోన్ పరిధిలో 18, వెస్ట్ జోన్ పరిధిలో 15 ఈస్ట్ జోన్ పరిధిలో 9 కేసులను పోలీసులు నమోదు చేశారు.
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.


