News January 30, 2025

సంగారెడ్డి: దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారిణి లలితకుమారి పేర్కొన్నారు. ఎంపికైన వారికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ww.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 6, 2025

సత్తెనపల్లి భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ఆత్మహత్య

image

సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

image

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

News July 6, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, MRO కార్యాలయాల్లో అర్జీలను ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.