News March 18, 2024

ఆమదాలవలస: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నియమావళి పై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పోటీలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సక్రమంగా సమర్పించాలన్నారు. సమస్యలుంటే 90323 18521 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

Similar News

News September 8, 2025

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

image

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీ‌హెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.

News September 8, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు

News September 8, 2025

శ్రీకాకుళంలోయథాతథంగా గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.