News January 30, 2025
అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను మార్యాదపూర్వకంగా కలిసిన సీపీ

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న ఆర్గనైజషన్, హోంగార్డ్స్ అడిషనల్ స్వాతి లక్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చాల అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అడిషనల్ డీసీపీని కలసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పీ భట్ ఉన్నారు
Similar News
News November 7, 2025
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
₹1,01,899 CR పెట్టుబడులకు CBN ఆమోదం

AP: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చూడడంతో పాటు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. భూమి, ఇతర రాయితీలు పొందిన వాటిని సమీక్షించి పురోగతి లేకుంటే రద్దు చేయాలని SIPB భేటీలో స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును ఏర్పాటుచేయాలని సూచించారు. కాగా భేటీలో ₹1,01,899 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు.
News November 7, 2025
‘గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 2 గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయని, ఆసక్తి గల వైద్యులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని సూచించారు. నెలవారీ వేతనం రూ.1.50 లక్షలుగా నిర్ణయించారని తెలిపారు. వివరాలకు 8499061999, 9491481481 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


