News January 30, 2025
Stock Market: మూడో రోజు కూడా లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. Sensex 226 పాయింట్లు ఎగసి 76,759 వద్ద, Nifty 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద స్థిరపడింది. ఫార్మా, రియల్టీ, ఆయిల్&గ్యాస్, బ్యాంకు, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలు రాణించాయి. BEL, Power Grid, Hero MotoCorp టాప్ గెయినర్స్.
Similar News
News January 26, 2026
ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. అంతకుముందు కీరవాణి కంపోజ్ చేసిన పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. త్రివిధ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి వారికి వీడ్కోలు పలికి అతిథులతో గుర్రపు బగ్గీలో అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
News January 26, 2026
మావోల గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47 మారుమూల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లు, బ్యాంకులు, పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.
News January 26, 2026
మంచు మనోజ్ భయంకరమైన లుక్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నాలోని సరికొత్త కోణం. క్రూరమైన, క్షమించలేని’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది.


