News January 30, 2025
ఎన్టీఆర్: డిగ్రీ (డిస్టెన్స్) పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయ్యద్ జైనులబ్ధీన్ తెలిపారు. బీఏ, బీకామ్(జనరల్&కంప్యూటర్స్) 1,2,3వ సెమిస్టర్ పరీక్షల రెగ్యులర్&సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామని, http://anucde.info/లో చూడాలన్నారు. రీవాల్యుయేషన్‌కై అభ్యర్థులు ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
జేఈఈ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పేపర్-2లో తెలుగు తేజాలు మెరిశాయి. పేపర్ 2ఏలో TGకి చెందిన శ్రేయస్ రెడ్డి 99.99 పర్సంటైల్.. ఏపీ నుంచి శరణ్య అశ్విని 99.95 స్కోర్ సాధించారు. పేపర్ 2బీలో TG నుంచి నాగ ప్రద్యుమ్న రెడ్డి 99.98, ఏపీలో హర్షాదిత్య, ఈశ్వర్ రాజ్, భీమ తులిప్ 99.95 స్కోర్ చేశారు. కేరళకు చెందిన సూర్యతేజస్, గౌరీశంకర్ మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. కాగా సెషన్-2 రిజిస్ట్రేషన్‌కు రేపే లాస్ట్ డేట్.
News February 24, 2026
NZB: అరైవ్ అలైవ్ వారోత్సవాలు.. విద్యార్థులకు అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణలో ముందస్తు అవగాహనే అత్యంత కీలకమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. అలైవ్ అరైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు అంబాసిడర్‌గా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2026
శ్రీకాకుళంలో డయేరియా కలకలం

AP: రాజమండ్రి <<19216426>>కల్తీ<<>> పాల ఘటన మరువక ముందే శ్రీకాకుళంలో భారీగా డయేరియా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ఈరోజు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 76కు చేరింది. బాధితులు జీజీహెచ్, కిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని <<19224272>>సీఎం<<>> ఇప్పటికే అధికారులకు సూచించారు.


