News January 30, 2025

శ్రీసత్యసాయి పాఠశాలల వేసవి సెలవుల షెడ్యూల్ విడుదల

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలకు వేసవి సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 17వ తేదీ పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని శ్రీ సత్యసాయి పాఠశాలల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Similar News

News January 14, 2026

టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సికింద్రాబాద్, RKపురంలోని <>ఆర్మీ పబ్లిక్ స్కూల్<<>> 38 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 3వరకు దరఖాస్తు హార్డ్‌ కాపీని అందజేయాలి. పోస్టును బట్టి సంబంధిత డిగ్రీ, BEd/MEd, CTET/TET, BCA, డిగ్రీ(CS)/BE/BTech, B.El.Ed/ D.El.Ed, MCA, డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apsrkpuram.edu.in/

News January 14, 2026

మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

image

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ భారీ మోసానికి గురయ్యారు. ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్‌కు చెందిన దంపతులు రూ.63 లక్షలు కాజేశారనే ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్‌మార్కెట్ నిపుణులమంటూ పరిచయం పెంచుకున్న అనూష, ప్రణీత్ దంపతులు ఫేక్ ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితోవ్ పోలీసులను ఆశ్రయించారు.

News January 14, 2026

WGL: పుర పోరులో మహిళా ఓటర్లదే పైచేయి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 3,35,244 మంది ఓటర్లలో మహిళలు 1,72,087 మంది ఉండగా, పురుషుల సంఖ్య 1,63,088గా నమోదైంది. పురుషుల కంటే 8,999 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. భూపాలపల్లి మినహా మిగిలిన అన్ని పురపాలికల్లో మహిళలదే పైచేయిగా ఉంది. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబాబాద్‌లోనూ మహిళా ఓటర్లే 2,571 మంది ఎక్కువగా ఉండటం విశేషం.